జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఇవాళ కూడా సభలో మద్యం పాలసీపై అసత్యాలు చెప్పి జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలను కించపరిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సభలో సీఎంకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే భజన చూడలేకే తమ సభ్యులు చిడతలు వాయించారని తెలిపారు. పాలసీని మార్చి దుకాణాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 దుకాణాల్లో మద్యం శాంపిల్స్ తీసి న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని…
అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం…
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.టీడీపీ 43% పిఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొడి…
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ఉ ఓటేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ప్రజలకు జగన్ చరిత్ర తెలిసి మరీ ఓటేశారని ఫైర్ అయ్యారు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేయడమంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటీ.. ? అంటూ సీరియస్ అయ్యారు. చంద్రబాబుకంటే ఎక్కువగా ఏదో మంచి చేస్తారని ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలన్నీ చేసేస్తాడేమో.. మనం ఏమైపోతాం అని.. రాజకీయంగా ఉండగలమా..? లేదా..? అని నేనూ భయపడ్డానని వెల్లడించారు.…
అమరావతి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషనులో ఏపీ వెనకబడి ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడి లో ముందుంటే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో ముందుందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమని మండి…
తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.. వైసీపీకీ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త సైదాపై వారి కార్యకర్తల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? అంటూ పోలీసులపై విమర్శనాస్త్రాలను సంధించారు. పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా అంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.…