కోల్‌కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్‌రూమ్‌లో స్నానం చేసినట్లు వెల్లడించింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.