ప్రస్తుతం ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కథనంలోని కొన్ని పాయింట్స్ తీసుకుని రాశారు. ఈ కథన ప్రకారం.. "ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచనల మేరకు ఇది జరుగుతోంది." అని పేర్కొన్నారు. ఈ వైరల్ కథనాన్ని చదివిన ప్రజలు షాక్, కలత చెందుతున్నారు.
బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్టుండి నగదు మాయం అయితే ఎలా ఉంటుంది. తమ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు సడన్‌గా మాయం అయితే గుండె ఆగినంత పని అవుతుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేశారా? లేదంటే ఇంకెవరైనా దోచుకున్నారా? అన్న భయంతో తీవ్ర ఆందోళన చెందుతాం.