ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు.. వరుసగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ వస్తున్న ఆయన.. రేపు ఉరవకొండ వేదికగా.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.