తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు.…