రశ్మిక మందణ్ణ క్షణం తీరిక లేకుండా కాలం గడిపేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఆమె అంగీకరించిన సినిమాల షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. అయినా కొత్త అవకాశాలు వచ్చినా వాటినీ వదులుకోకుండా పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమ పడటానికి మన స్టార్ హీరోయిన్లు అలవాటు పడిపోయారు. రశ్మిక మందణ్ణ కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. సరిగ్గా ఆరు రోజుల క్రితం శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంది…
హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తొలిసారి శర్వానంద్ సరసన నాయికగా నటిస్తోంది రశ్మికా మందణ్ణ. అంతేకాదు… కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి. మంగళవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. పలు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న రశ్మిక… మొదటిరోజు శర్వానంద్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం విశేషం. అలానే శర్వానంద్…