కేంద్రంలోని బీజేపీకి కొరకరాని కొయ్యగా పశ్చిమబెంగాల్ మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి సర్వశక్తులను ఒడ్డింది. మరోవైపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సైతం తన పట్టును కాపాడుకునేందుకు శతవిధలా ప్రయత్నించింది. హోరాహోరీ ఫైట్లో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బెనర్జీ మాత్రం ఓటమి పాలవడం బీజేపీకి కొంత ఊరటను ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు…