తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అంతా సిద్ధం అయింది. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి…