#90's: ఈ మధ్యకాలంలో ఓటిటీలో వచ్చిన ఏదైనా మంచి సిరీస్ ఉంది అంటే అది #90's మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించాడు. జనవరి 5 న ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.