ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
నిర్మల్ జిల్లా రత్నా పూర్ కాండ్లి నుంచి 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయింది. రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామడ వరకు ఈ యాత్ర కొనసాగనున్నారు. ఈరోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర "ప్రజా సంగ్రామ యాత్ర" కొనసాగనుంది.