జపాన్‌లో ఊహించని ఘటన చోటు చేసుకొంది. మియాజాకీ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబు హఠాత్తుగా పేలింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం (WW-II) నాటి బాంబుగా జపాన్ అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పాతి పెట్టిన ఈ బాంబు.. ఇన్నేళ్ల తర్వాత పేలింది.