హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. హిందూపురం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. అందులో పూజారిని మాత్రమే నేను అన్నారు..