నందమూరి తారక రామారావును ఏ ముహూర్తాన ‘నటరత్న’ అన్నారో, ఎవరు ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని దీవించారో కానీ, ఆయన ఆ బిరుదులకు అన్ని విధాలా అర్హులు! అంతేనా ఆయన నటజీవితంలో అన్నీ ఎవరో అమర్చినట్టుగానూ జరిగిపోయాయి. తెలుగునాట హీరోగా వంద చిత్రాలను, రెండు వందల సినిమాలను అతివేగంగా పూర్తి చేసిన ఘన చరిత్ర ఆయన సొంతమే! ఇక ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక, జానపద చిత్రాలో కథానాయకునిగా వెలుగొందిన ఘనత కూడా ఆయన పాలే! మన దేశంలో అత్యధిక…