Infosys: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో చేసిన పని గంటల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగులకు సూచించడం విమర్శల పాలైంది. అయితే, కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ని అందించాలని కోరుకుంటోంది.
నారాయణమూర్తి పని రోజుల కంటే సమర్థతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం తెలిపారు. మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా కొనసాగుతుంది.. మంచి సామాజిక, సామరస్య పరిస్థితుల కోసం వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.