తెలుగు రాష్ట్రాల రైతులకు కల్పతెరువుగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించి నేటితో 66 ఏళ్లు పూర్తవుతోంది. 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ డ్యాం నిర్మాణం 1970లో పూర్తయింది. కృష్ణానదిలపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతిపెద్దది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమశక్తి ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలామంది కార్మికులు అసువులు కూడా బాశారు. ప్రపంచంలో…