తెలుగు చలనచిత్రసీమలో మరపురాని చిత్రాలను అందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ తొలి చిత్రం ‘దొంగరాముడు’తోనే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మించిన రెండవ సినిమా ‘తోడికోడళ్ళు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేనితో ఆదుర్తి తెరకెక్కించిన తొలి చిత్రమిదే. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఏయన్నార్, ఆదుర్తి కాంబినేషన్ లో అనేక జనరంజక చిత్రాలు రూపొందాయి. 1957 జనవరి…