(డిసెంబర్ 14తో కాబులీవాలాకు 60 ఏళ్ళు)విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మాతృభాష బెంగాలీలో అనేక కథలు రచించారు. వాటిలో కాబులీవాలా ప్రత్యేకమైనది. అందులో మానవత్వం మన మదిని తడుతుంది. బంధాలు-అనుబంధాల్లోని మాధుర్యం మనను వెంటాడుతుంది. అందుకే గొప్పకథల్లో ఒకటిగా కాబులీవాలా వెలుగొందుతూనే ఉంది. ఈ కథను పలు యూనివర్సిటీలు పాఠ్యాంశంగానూ నెలకొల్పిన సందర్భాలున్నాయి. ఈ కథ ఆధారంగా ప్రముఖ హిందీ బెంగాలీ చిత్ర దర్శకులు బిమల్ రాయ్, లీలా దేశాయ్ తో కలిసి కాబులీవాలా చిత్రాన్ని హిందీలో నిర్మించారు.…