పశ్చిమ ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 59 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పేలుడు సంభవించిందని సమాచారం. పేలుడు సంభవించిన వెంటనే మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయని… తొలి పేలుడు రాత్రి 2…