భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్‌కు ఇంకో ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలో.. ముంబై వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ముంబైలో కూడా అలాంటిదే జరిగింది.. ఇరు జట్ల స్పిన్నర్లు భారీగానే వికెట్లు పడగొట్టారు.