రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం500 రోజులుగా కొనసాగుతుంది. 2022ను యుద్ధనామసంవత్సరంగా మారింది.. 2022, ఫిబ్రవరి 24న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం ప్రారంభమయినప్పుడు ఇన్ని రోజుల పాటు కొనసాగుతుందని ఎవరు అనుకోలేదు. నాలుగైదు రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని అందరు అనుకున్నారు. అసలు యుద్ధం లక్ష్యమేంటో తెలియనప్పటికీ నెలరోజులలోపు ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని అందరు అంచనా వేశారు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి.