(అక్టోబర్ 6న ‘చిన్ననాటి స్నేహితులు’కు 50 ఏళ్ళు) రియల్ లైఫ్ కేరెక్టర్స్ రీల్ పైనా కనిపిస్తే ఆసక్తిగానే ఉంటుంది. గూంటూరు ఏ.సి. కాలేజ్ లో చదువుకొనే రోజుల్లో నటరత్న యన్.టి.రామారావు, కళావాచస్పతి జగ్గయ్య మిత్రులు. కాలేజ్ లోనే పలు నాటకాలు వేశారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ నాటక సమాజం నెలకొల్పి కూడా వారిద్దరూ పలు నాటకాలు ప్రదర్శించారు. అలాంటి చిన్ననాటి స్నేహితులతో కె.విశ్వనాథ్ అదే టైటిల్ పెట్టి సినిమా తీయడం నిజంగా విశేషమే! యన్టీఆర్, జగ్గయ్య…