కోల్‌కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్‌కతా వీధులన్నీ జలమయం అయ్యాయి. బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఎక్బాల్‌పూర్‌లో వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీనజీవనం స్తంభించింది.