(ఆగస్టు 14న ‘కలియుగ పాండవులు’కు 35 ఏళ్ళు పూర్తి)విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ ఆగస్టు 14తో 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే, హీరోగా వెంకటేశ్ 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నారన్న మాట! తొలి చిత్రంతోనే హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ద్వారాను ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.…