ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు.