ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే జట్లపై స్టార్ స్పోర్ట్స్ నిపుణుల ప్యానల్ అంచనా వేసింది. అందులో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్ఆర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్కు వెళ్తాయని ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, మహమ్మద్ కైఫ్, టామ్ మూడీ, మాథ్యూ హెడెన్లు అభిప్రాయపడ్డారు. అయితే, 18వ తేదీన సీఎస్కేతో మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ప్లేఆఫ్స్కు వెళ్తుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ సెమీఫైనల్ కు చేరే జట్ల గురించి చెప్పేశాడు. నవంబర్ 15, 16న జరిగే తొలి, రెండో సెమీ ఫైనల్ కి చేరే నాలుగు జట్లు ఏవో తేల్చి చెప్పేశాడు. అందులో భారత్ ఉండగా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉందని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.