కోర్టు ధిక్కార నేరం కింద పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ 40 మిలియన్ల అమెరికన్ డాలర్లను విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన కేసులో సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 9వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా విదేశాల్లో ఉన్న ‘డియాజియో’ కంపెనీ బ్యాంకు…