సాధువుల వేషంలో దర్జాగా చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారికి స్థానికులు బడిత పూజ చేశారు. కర్రలు, చెప్పులతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.