మరోసారి తెలుగుతమ్ముళ్లపై తీవ్ర స్థాయిలో కొడాలినాని విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ పై ధ్వజమెత్తారు. ఎవ్వరరూ ఏమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆయన వెల్లడించారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ చేపట్టామని ఆయన అన్నారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. అమరావతి కూడా ఉంటుందని నాని వ్యాఖ్యానించారు. కేవలం…
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం బిల్లుని ఉపసంహరించుకోవడం… మళ్ళీ సమగ్రంగా బిల్లుని ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో రాష్ర్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా విశాఖ పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేసారు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది. అమరావతి రైతులు అర్ధం చేసుకోవాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.…