ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగానే వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,896 శాంపిల్స్ పరీక్షించగా.. 381 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 414 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి…