భూప్రకంపనలు ప్రకాశం జిల్లాను వీడడం లేదు.. వరుసగా మూడు రోజుల నుంచి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.. తాజాగా, ముండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. రాత్రి 8:15 నిమిషాలకు.. 8:16 నిమిషాలకు.. 8:19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు..