Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.