Abdul Rehman Makki: ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ ఈరోజు పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు. అయితే, గత కొద్ది రోజులుగా లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ.. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని జమాత్-ఉద్-దవా అధికారి ధృవీకరించారు.