ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ తెలంగాణ వాసుల్ని భయపెడుతోంది. దీనికి తోడు కరోనా మూడో దశ ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వరంగల్ వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా ముందస్తు చర్యల పైన అధికారులు దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాలకు ఏకైక పేదల పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్ ఎంజీఎంలో మరో మారు 250 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.…