హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను మంగళవారం బీజేపీ ప్రకటించింది. 21 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.