ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో శతాబ్దకాలం తర్వాత క్రికెట్‌కు మళ్లీ చోటు దక్కిన విషయం తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల తర్వాత.. లాస్ ఏంజిలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. విశ్వ క్రీడల నిర్వహణ కోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు తాజాగా నిర్వాహకులు ధృవీకరించారు. ఆతిథ్య హోదాలో అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 2032లో బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ ఉంటుంది.…