ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మంటలు వేడిరాజేస్తూనే వున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ దైన రీతిలో మండిపడుతూనే వున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతంలో చేసి ఉంటే అడ్రస్ లేకుండా ఉండేవాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 2024లో చంద్రబాబుని రాష్ట్రం నుండి పంపిచేస్తే…