తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు…