Rahul Gandhi criticizes PM Narendra Modi: 2002లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతో పాటు మరో ఏడుగురిని చంపిన కేసులో నిందితులను విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, గుజరాత్ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శించారు.