అవకాశం దొరికితే చాలు మోసగాళ్ళు డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల ఒక బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి కోట్లరూపాయలు కాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడికి షాకిచ్చారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ కు చెందిన నితిన్ తన అక్క పెళ్లి కోసం లక్షరూపాయలకు పైగా బ్యాంకులో దాచుకున్నాడు. నితిన్ దాచుకున్న లక్ష రెండు వేల రూపాయలు ఓ లింకు ఓపెన్ చేయడంతో ఖాళీ అయిపోయాయి. ఆన్ లైన్ ట్రాన్షాక్షన్ పనిచేయడం…