అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వద్ద…