మహారాష్ట్ర షోలాపూర్ నగరంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణ కేంద్రంలోని దాదాపు 170 మంది ట్రైనీ పోలీసులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కేంద్రంలో తయారుచేసిన ఆహారం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. బాధిత ట్రైనీ పోలీసులందరినీ వెంటనే షోలాపూర్‌లోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. వారిలో దాదాపు 15 మందికి సెలైన్ ఇచ్చి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.…