భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ గురువారం సిక్కింలో 17,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల (ATGM) కాల్పులతో కూడిన శిక్షణా వ్యాయామం నిర్వహించిందని డిఫెన్స్ పిఆర్ఓ తెలియజేశారు. మొత్తం తూర్పు కమాండ్ లోని మెకనైజ్డ్, పదాతి దళం నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్‌మెంట్ లు శిక్షణా వ్యాయామంలో పాల్గొన్నాయి. ఈ కసరత్తులో సమగ్ర కొనసాగింపు శిక్షణ, వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కదలడం, యుద్ధభూమి పరిస్థితులను వివరించే స్థిర లక్ష్యాలపై ప్రత్యక్ష కాల్పులు…