నెల్లూరుకు చెందిన అకరపాక సురేష్ అనే దివ్యాంగుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనను చెడు వ్యసనాల నుంచి కాపాడింది, సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవప్రదంగా నిలబెట్టింది అయ్యప్పస్వామి అని దివ్యాంగుడు బలంగా నమ్మాడు. దీంతో ఏకంగా 750 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 20న నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని పాదయాత్రగా బయలుదేరిన సురేష్.. కరోనా కాలంలోనూ ఎన్నో వ్యయ…