తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి.…