తెలంగాణలోని ఆదివాసీలు ఎక్కువగా గుస్సాడీ నృత్యం చేస్తుంటారు. దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకతగా చెబుతారు. ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు…