Cockfight: సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రెండో రోజు నిర్వహించిన కోడి పందాలు భారీగా సాగాయి. లక్షలాది రూపాయలు పందాల్లో పెట్టగా, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1 కోటి 53 లక్షల భారీ పందెం కుదిరింది. ఈ పందెం గుడివాడ ప్రభాకర్ సేతువ మరియు రాజమండ్రికి చెందిన రమేష్…