Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యుల నడ్డి విరుగుతోంది. పన్నులు మీద పన్నులు…జీఎస్టీల మీద జీఎస్టీలు…చార్జీలు, ఫీజులు రూపంలో ప్రభుత్వాలు, వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, వివిధ రకాల యూపీఐ యాప్స్, ఆన్లైన్ సేవల చార్జీలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక దాన్నుంచి తేరుకునేలోపే…మరో చార్జీ బాదుతున్నాయి. జనాన్ని బాదాలి…ఖజానాను నింపుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. భారతీయులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. జనం కొన్ని తెలిసి చెల్లిస్తే…మరి కొన్ని తెలియకుండా చెల్లిస్తున్నారు. ఎన్ని రకాలుగా వసూలు చేయాలో అన్ని చేస్తోంది. ఒకటా రెండా లెక్క లేనన్ని రూపాల్లో…ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. జీఎస్టీ, యూపీఐ, సర్వీసు ట్యాక్స్…చెప్పుకుంటూ పోతే చిట్టా చాంతాడంతా తయారవుతుంది.
Also Read
- Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
- Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు…ఈ ఫార్మూలాను ప్రభుత్వాలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్, యాప్స్ పక్కాగా అమలు చేస్తున్నాయి. పన్నులు, చార్జీలు, ఫీజులు…ప్రజల నుంచి ఎన్ని రకాలుగా వసూలు చేయాలో అన్ని చేస్తున్నాయి. ఒక బాదుడు మరువక ముందే…మరో బాదుడు మొదలెట్టేస్తున్నాయి. హోటల్లో తింటే ఒక ట్యాక్స్…ఆ బిల్లును ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మరో బాదుడు. వాటినే హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే చార్జీలు. నిత్యావసరాలు షాపింగ్ మాల్‌కు వెళితే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ…వాటినే ఆన్లైన్ ఆర్డర్ పెడితే మరో రూపంలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా..దేశ ప్రజల పరిస్థితి తయారైంది. ఆస్తులు కొనుగోలు చేస్తే చార్జీలు…అదే ఆస్తులను విక్రయిస్తే ఫీజులు…ఏటీఎం నుంచి విత్ డ్రా చేస్తే చార్జీలు…ఏటీఎం నుంచి విత్ డ్రా చేయకపోతే…అదే ఏటీఎం కార్డుకు యాన్యువల్ ఫీజులు…సామాన్యులను దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
జనంపై పన్నుల బాదుడులో ప్రభుత్వాలు ఎక్కడా తగ్గడం లేదు. ఎక్కడ వీలుంటే అక్కడ జనాన్ని బాదుతూనే ఉంది. డెబిట్ కార్డు యాన్యువల్ చార్జీలు, ఎటీఎం విత్ డ్రా చార్జీలు, ఎస్ఎంఎస్ చార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకపోతే బాదుడు…లోన్ పెడితే దానికి మరో చార్జీ…ఆ లోన్ క్లియర్ చేస్తే ఇంకో చార్జీ…ఇల్లు కొనుగోలు చేస్తే మళ్లీ బాదుడు. ఇవన్నీ బ్యాంక్‌లు వివిధ రూపాల్లో వసూలు చేసే చార్జీలు మాత్రమే. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఎన్నో రకాల వసూలు వినియోగిస్తాం. వాటిలో కొన్నింటికి తెలిసే చార్జీలు చెల్లిస్తున్నాం. మరి కొన్నింటికి మాత్రం జనం తెలియకుండా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో డబ్బు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఏ సర్వీసు అయినా…డబ్బు చెల్లించకుండా పొందలేని పరిస్థితి నెలకొంది.
చార్జీల మీద చార్జీలు…బాదుడు మీద బాదుళ్లతో సామాన్యుల నడ్డి విరచడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. రోజు కొత్త ఫార్ములాను కని పెట్టి…ప్రజల నుంచి ఎలా డబ్బు వసూలు చేయాలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఫోన్ పో, గూగుల్ పే, వాట్సాప్ పేమెంట్స్ ప్లాట్‌ఫాంపై డీటుహెచ్లు, ఫోన్ రీచార్జ్‌లు చేసినా…ఆన్లైన్ చెల్లింపులు చేసినా చార్జీలు పడుతున్నాయి. ప్రజలపై హోటల్స్ మూడు ట్యాక్స్‌లు వడ్డిస్తున్నాయి. బిల్లుపై సీజీఎస్టీ, ఎస్జీఎస్టీకి అదనంగా సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు. అలాగే పెట్రోలు కొనుగోలు చేస్తే…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీలు వసూలు చేస్తున్నాయి. స్విగ్గీ, జోమోటో, బ్లింకిట్లలో ఏది కొన్నా బాదుడే బాదుడు. వంద రూపాయల ఫుడ్ ఐటం ఆర్డర్ చేస్తే మరో వంద రూపాయలు అదనంగా వేస్తున్నారు. సర్వీస్ యాప్స్ పేరుతో అదనంగా 30 – 40 శాతం అదనంగా ఛార్జీలు వేస్తున్నారు. అందులోనూ ఆన్లైన్ పేమెంట్స్ ఒక బాదుడు…క్యాష్ పేమెంట్స్ అయితే మరో రూపంలో జనాన్ని దోచేస్తున్నాయి.
ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఇస్మార్ట్ యుగంలో క్షణాల్లో పేమెంట్స్ చేసేస్తున్నాం. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి..ఇలా చెల్లించగానే అలా థాంక్యూ బాస్.. సక్సెస్ అనే మెసేజ్ వస్తోంది. 10 నుంచి లక్షలదాకా లావాదేవీలు చిటికెలో జరిగిపోతున్నాయి. డిజిటల్ విప్లవం వచ్చాక క్యాష్ ట్రాన్సక్షన్ చాలా వరకు తగ్గాయి. అంతా యూపీఐ పేమంట్సే. ఎన్ని వేలైనా,లక్షలైనా .. సింగిల్ క్లిక్‌తో వెళ్లిపోతున్నాయి. ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో అంతా డిజిటల్ పేమెంట్స్‌కు ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు. 2 వేలు దాటితే ఆలోచించాల్సిందే. పర్సన్ టు పర్సన్‌కు నో ఛార్జెస్. వర్రీ లేకుండా ఎప్పటిలాగే హ్యాపీగా పంపుకోవవచ్చు. 2వేలకు మించి వ్యాపారులకు చెల్లించే దానిపై వడ్డన పడబోతోంది. ఇందులో వినియోగదారులకు వచ్చిన ఇబ్బందేం లేదు. ఎందుకంటే వ్యాపారియే ఆ మొత్తం ఛార్జీల్ని భరించాలి. మరి ఆ భారాన్ని వినియోగదారులపై వేయరనే గ్యారంటీ ఏంటి ? కస్టమర్ల భారాన్ని వ్యాపారులు ఎందుకు భరిస్తారు ? ఏదో రూపంలో కస్టమర్‌పై వేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది. 2వేలు పైబడి వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. సాధారణ వినియోగదారులు ఎప్పటిలాగే యూపీఐ లావాదేవీలను ఉచితంగానే కొనసాగించవచ్చు. అలాగే వ్యక్తుల మధ్య జరిగే నగదు లావాదేవీలు , 2000లోపు వ్యాపార చెల్లింపులు ఎండీఆర్ పరిధిలోకి రావని స్పష్టంచేసింది ఎన్పీసీఐ. ఎండీఆర్ ఛార్జీల నుంచి చిన్న వ్యాపారుల్ని మినహాయించింది. ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్ కింద నెలకు లక్ష వరకు బ్యాంక్ ఖాతాలోకి క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ వర్తించదని తేల్చి చెప్పింది.
డిజిటల్ యుగంలో మొదట్లో ఎలాంటి చార్జీలు ఉండవని ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ నమ్మిస్తున్నాయి. దీన్ని నమ్మిన జనం కాలు కదపకుండా…ఇంటి నుంచే అన్ని పనులు చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచే ఆన్లైన్ బుకింగ్స్ నుంచి పవర్ చార్జీలు దాకా అన్నింటికి ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నారు. స్మార్ట్‌గా పని అయిపోతుందన్న కారణంతో ఈజీ పేమెంట్స్‌కు అలవాటు పడుతున్నారు. ఆ తర్వాత ఆయా ఫ్లాట్‌ఫామ్స్ లేదంటే ఆన్లైన్ యాప్‌లు…ప్రజలకు అసలు రూపాన్ని చూపిస్తున్నాయి. చార్జీల మీద చార్జీలు వేసి…జనానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.
- Tags
- GST tax
- ntv
- story board
తాజావార్తలు
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!