Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Ntv Story Board On Is Gold A Safe Investment For The Common Man

Story board: సామాన్యులకు ‘పసిడి’ని మించిన సిరి లేదా..? బంగారం సేఫ్ ఇన్వెస్ట్‌మెంటా..?

Published Date :September 25, 2025 , 10:16 am
By Sudhakar Ravula
  • బంగారం ధర మరోసారి ఆల్‌టైం హై కి..
  • 10 గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలు..
  • బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్న ఇన్వెస్టర్లు..
Story board: సామాన్యులకు ‘పసిడి’ని మించిన సిరి లేదా..? బంగారం సేఫ్ ఇన్వెస్ట్‌మెంటా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story board: బంగారం ధర మరోసారి ఆల్‌టైం హై కి చేరింది. పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలకు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే, అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.

గత ఐదు సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. దీనికి కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ, అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. ప్రస్తుతం, ఈక్విటీ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు సున్నా రాబడిని అందించింది. ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం, గత సంవత్సరంలో బంగారు ఇటిఎఫ్‌లు 47% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.

బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్సుకు 4,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 3 లక్షల 40 వేలుపై మాటే. తులం బంగారం రూ.లక్ష ఇరవై వేలకు చేరువైతేనే బెంబేలెత్తుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి.

గతంలో 2025లో బంగారం ధరలు 3,100 నుంచి 3,500 డాలర్ల పరిధిలో ఉంటాయని చెప్పిన సిటీ బ్యాంక్ ఇప్పుడు దాన్ని 3,300 నుంచి 3,600 డాలర్లకు పెంచింది. ఫిడెలిటీ, గోల్డ్‌మ్యాన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా బంగారం విషయమై ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థికం ఇంతవరకూ పూర్వస్థితికి చేరుకోలేదు. ఇక ఉరుము లేని పిడుగులా వచ్చిపడుతున్న ట్రంప్ సుంకాలు గోల్డ్ కు డిమాండ్ ను అమాంతం పెంచేస్తున్నాయి. దీనికి తోడు దేశీయంగానూ పసిడికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ కారణాలన్నీ కలిసికట్టుగా పసిడి పరుగును ప్రేరేపిస్తున్నాయి. ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరత, రియల్ ఎస్టేట్ స్లో డౌన్ తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది. చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారెంటీగా 15 శాతం రాబడి ఇస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముందనే ఆలోచనలు వస్తున్నాయి.

గోల్డ్ రేట్లలో అప్ ట్రెండ్ షురూ అయిందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరను మేజర్‌గా డిసైడ్‌ చేసేది అంతర్జాతీయ మార్కెటే. మనదేశం.. బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండటమే అందుకు కారణం. అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌తో పాటు డాలర్‌ మారక విలువ ఆధారంగా.. బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. భారత్ సహా ఆసియా దేశాలలో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు. కానీ మిగిలిన ఇతర దేశాలలో బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు. పెట్టుబడిదారులంతా.. తమకు ఎక్కువ లాభం ఎక్కడ వస్తుందనుకుంటే.. అక్కడ ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు.. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అందుకే యుద్ధభయాలు, మాంద్యం ఆందోళనలు ఎదురైనప్పుడల్లా.. బంగారంపై పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూ ఉంటుంది.

ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకొని నిలబడగలిగే ఏకైన సాధనం బంగారం. ప్రభుత్వాల్లో అనిశ్చితి, ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతుంటాయి. అంతేకాదు… ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే ఏకైన సాధనం బంగారం. అందుకే బంగారానికి అంత డిమాండ్‌. ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది మార్కెట్‌ నిపుణుల విశ్లేషణ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారత దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24 వేల టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ. భారత్‌లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28 శాతం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28 శాతం భారత్‌లోనే ఉంది.

కేంద్ర బ్యాంకులు కూడా ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. 63 శాతం మంది పెట్టుబడిదారుల బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలు చెబుతున్నాయి. బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్ కు ఇది సంకేతంగా నిలుస్తోంది. కోవిడ్ కారణంగా ధనిక దేశాలు, పేద దేశాలు అనే తేడా లేకుండా.. అన్ని దేశాల సార్వభౌమ రేటింగులు దారుణంగా పడిపోయాయి. ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడాని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది. నిరుద్యోగ రేటు ఊహించనంతగా పెరిగింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా.. ఇప్పుడు వీలైనంత బంగారం కొని పెట్టుకోవాలనే దృష్టితో ఉన్నాయి. ఓవైపు రిటైల్ మార్కెట్ డిమాండ్ కు తోడు.. కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండటంతో.. భవిష్యత్తులో పసిడి మరింత వేగంగా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమౌతున్నాయి. ఎప్పటికైనా బంగారం కొనిపెట్టుకుంటే.. చెడ్డవారెవరూ లేరనేది తేలిపోతోంది. బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు, రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షిత పెట్టుబడి సాధనమేనని నమ్మొచ్చేమోకానీ.. భారతీయులకు ఈ గణాంకాలతో పనిలేని మాట నిజం. మనకు మొదట్నుంచీ పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా.. పేద, ధనిక అంతరాలు లేకుండా.. అందరూ తమకు ఉన్నంతలో ఎంతోకొంత పసిడి నిల్వలు పెంచుకోవాలనే చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gold
  • Gold investment
  • gold prices
  • ntv storyboard
  • NTV Telugu

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions