Site icon NTV Telugu

Story Board: ఐటీ రంగం కుదేలు.. సాఫ్ట్వేర్లో ఆగని లే ఆఫ్లు..!

Sb

Sb

Story Board: ఆరంకెల జీతం.. బిందాస్ లైఫ్.. సాఫ్ట్ వేర్ జాబ్. ఒక్కసారి ఆ సంస్థలో చేరితే తిరుగుండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయొచ్చనుకునే వాళ్లు టెకీలు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్. ఎప్పుడు ఏ సంస్థ లే ఆఫ్ లు ప్రకటిస్తుందో తెలియని పరిస్థితి. కొన్నాళ్లుగా దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇస్తున్నాయి. పింక్ స్లిప్‌లతో టెన్షన్ పెట్టిస్తున్నాయి.

Read Also: Crime News: ఆరేళ్ల ప్రేమ.. 6 రోజులు కూడా కాపురం చేయక ముందే!

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగులకు కలల ప్రపంచం.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్‌ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వణికిపోతున్నాయి. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్‌ స్లిప్‌ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్‌ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్‌ చేసుకున్నా ఆఫర్‌ లెటర్‌ ఇవ్వడం లేదు.

Read Also: Tragedy: అమెకారిలో కాల్పులు.. తెలంగాణ యువకుడు మృతి

ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లేఆఫ్‌ల ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుత ఆటోమేషన్‌ యుగంలో కంపెనీ అవసరాలను తీర్చలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. అయితే దీర్ఘకాలం కంపెనీతో అనుబంధం కలిగిన ఉద్యోగులకు మాత్రం దాదాపు రెండేళ్ల వేతనం పరిహారంగా చెల్లించనుంది. ఈ ఏడాది జులైలో ప్రకటించిన 12 వేల మందికి లేఆఫ్‌ల ప్రకటనలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టింది. క్లయింట్‌ అవసరాలు తీర్చలేని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను లేని ఉద్యోగులను టీసీఎస్‌ తొలగిస్తోంది. ఇందులో భాగంగా మూడు నెలల నోటీసు పీరియడ్‌ ఇస్తోంది. అంటే ఆ మూడు నెలలకు కంపెనీ వేతనంగా చెల్లిస్తుంది. దీనికి అదనంగా ఆరు నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ కింద చెల్లించనుంది. ఎవరైతే 8 నెలలకు మించి బెంచ్‌ పై ఉంటారో వారికి సింప్లర్‌ ప్యాకేజీ మాత్రమే చెల్లిస్తారు. అంటే నోటీసు పీరియడ్‌ వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు.

Read Also: Mandadi : చెన్నైలో సినిమా షూటింగ్ లో ప్రమాదం

కంపెనీలో 10-15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ…తాజా లేఆఫ్‌లలో ఉద్యోగం కోల్పోయిన వారికి ఏడాదిన్నర వేతనాన్ని పరిహారంగా చెల్లిస్తారు. అదే 15 ఏళ్లు దాటిన వారికి గరిష్ఠంగా 2ఏళ్ల వేతనంగా ఇస్తారు. దీంతో పాటు అదనంగా ఔట్‌ప్లేస్‌మెంట్‌ సేవలు లభిస్తాయి. అవసరమైన వారికి టీసీఎస్‌ కేర్స్‌ ప్రోగ్రామ్‌ కింద మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స లేదా థెరపీని అందిస్తారు. దీంతో పాటు రిటర్మైంట్‌కు దగ్గరపడిన వారికి ముందస్తు పదవీ విరమణకూ టీసీఎస్‌ అవకాశం కల్పిస్తోంది. వీరికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ చెల్లించడంతో పాటు బీమా ప్రయోజనాలను కల్పిస్తారు.

Read Also: Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!

మీటింగ్ ​అంటూ ఉద్యోగులకు కబురు పంపుతారు. ఆఫీస్‌కు వచ్చాక…చావు కబురు చల్లగా చెబుతున్నట్లు బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి…తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్​ మీడియాలో పంచుకున్నారు. అమెరికా కంపెనీ అనేక మంది భారతీయులను…జస్ట్‌ ఒక కాల్‌తోను ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అక్టోబర్ జీతం నెలాఖరులో చెల్లిస్తామని…అలాగే మిగిలిపోయిన సెలవులను ఎన్‌క్యాష్ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. 11 గంటలకు ఉద్యోగులు లాగిన్‌ అవగానే…11గంటల ఒక నిమిషానికి అందరి కెమెరాలు, మైకులు నిలిపివేసినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల్లో చాలా మందిని తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సీఈవోలు చెప్పడాన్ని జీర్నించుకోలేకపోతున్నారు.

Read Also: Air India: ఎయిర్ ఇండియా విమానం నుంచి హఠాత్తుగా బయటకు వచ్చిన ‘‘ర్యాట్’’

కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. 2024లో దాదాపు 4వందల కంపెనీలు లక్షా 10 వేల మందికిపైగా కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్‌ సైతం ఇదే బాట పట్టాయి. దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటించడం ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతోంది. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాదిమందిని తొలగించిన సంస్థలు.. ఇప్పుడు ఏఐ అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు కొనసాగిస్తున్నాయి.

Read Also: Child Murder: మామ, అత్త మూఢ నమ్మకాలకు చిన్నారి బలి.. చిన్నారి నోటికి ప్లాస్టర్, ఆపై బతికుండగానే?

మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, క్రౌడ్‌ స్ట్రయిక్స్‌ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 130కంపెనీల్లో 61వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనే భయాలు నెలకొన్నాయి. ఆదాయం వృద్ధిలో తగ్గుదల, స్థూల ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాల్లో కృత్రిమ మేథ ప్రాబల్యం పెరగటం వంటి కారణాలు ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. లే ఆఫ్స్‌ డేటా అధ్యయన సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 సంస్థలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 61వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి.

Read Also: Roshan : రోషన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. ‘హిట్’ డైరెక్టర్‌తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ సర్కారు దృష్టి సారించిన వేళ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసుపై అమెరికన్‌ సెనేటర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అమెరికాలో ఆ సంస్థ అనుసరిస్తున్న నియామక ప్రక్రియ గురించి వివరాలు ఆరా తీశారు. అమెరికన్‌ ఉద్యోగులను హెచ్‌-1బీ వీసాదారులతో భర్తీ చేశారా ? అమెరికన్‌ సిబ్బందికి చెల్లిస్తున్నదెంత ? హెచ్‌-1బీ వీసాదారులకు చెల్లిస్తున్నదెంత ? వంటి ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. దీనిపై అక్టోబర్‌ 10లోపు సమాధానం చెప్పాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న తమ ఉద్యోగుల్లో 12 వేలమందిని తొలగించింది. అందులో కొందరు అమెరికన్‌ ఉద్యోగులూ ఉన్నారు.

Read Also: Alcohol Addiction: పైసా సంపాదన ఉండదు.. రాత్రి లేదు పగలు లేదు.. నిత్యం చుక్క పడాల్సిందే

ఓ వైపు అమెరికన్‌ ఉద్యోగులను లేఆఫ్‌ చేస్తూ వేల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసాల కోసం పిటిషన్లు ఎందుకు ఫైల్‌ చేస్తున్నారంటూ టీసీఎస్‌ను లేఖలో ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,505 హెచ్‌-1బీ వీసాదారులను నియమించుకునేందుకు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. టీసీఎస్‌ నియమించుకోవడానికి నైపుణ్యం కలిగిన అమెరికన్‌ వర్కర్లు దొరకలేదంటే నమ్మలేకపోతున్నామని సెనెటర్లు అభిప్రాయపడ్డారు.

Read Also: Koti Deepotsavam 2025: ఆధ్యాత్మిక మహాసమ్మేళనం.. నవంబర్ 1 నుంచి భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’

అమెరికన్‌ ఉద్యోగులను హెచ్‌1బీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారా ? సాధారణ నియామక ప్రకటనల నుంచి H-1B నియామక ప్రకటనలను దాచిపెడుతున్నారా ? అమెరికన్‌ వర్కర్లకు చెల్లించే వేతనాన్నే విదేశీ ఉద్యోగులకు చెల్లిస్తున్నారా ? ఆమోదం పొందిన వీసాల్లో ఎంతమంది ఔట్‌సోర్సింగ్‌ కింద ఇతర కంపెనీల్లో పనిచేస్తున్నారు ? వంటి 9 ప్రశ్నలను సంధించారు. దీనిపై అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. దీనిపై టీసీఎస్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. 2-5 వేల డాలర్లుగా ఉన్న హెచ్‌-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెంచారు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌కు సెనేటర్ల నుంచి ఈ ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. టీసీఎస్‌తో పాటు కాగ్నిజంట్, అమెజాన్, యాపిల్, డెలాయిట్, గూగుల్, జేపీమోర్గాన్‌ చేజ్, మెటా, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్‌ కంపెనీలనూ సెనెటర్లు ఇదే తరహాలో ప్రశ్నించారు.

Exit mobile version