4 వికెట్ల తేడాతో యువ భారత్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కుర్రాళ్లు అదరగొట్టడంతో…ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకుంది భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది. ఇంగ్లాండ్‌తో ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన యువ భారత్.. 4 వికెట్ల తేడాతో గెలిచి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. 24 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్‌కి నిరాశ తప్పలేదు. ఆ జట్టుకి తాజా టోర్నీలో ఎదురైన తొలి ఓటమి ఇదేకాగా.. భారత్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా టైటిల్‌ని గెలుపొందడం గమనార్హం. ఇంగ్లాండ్ 1998లో ఒక్కసారి మాత్రమే కప్‌ని గెలవగా.. భారత్ వరుసగా 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. భారత బౌలర్ల దెబ్బకి 44.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితంకాగా.. ఇందులో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే.. జేమ్స్ ర్యూ (95: 116 బంతుల్లో 12×4) అసాధారణ పోరాటంతో ఇంగ్లాండ్ 189 పరుగులైనా చేయగలిగింది. చివర్లో జేమ్స్ సేల్స్ (34 నాటౌట్: 65 బంతుల్లో 2×4) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో రాజ్ బవా ఐదు వికెట్లు పడగొట్టగా.. రవి కుమార్ 4, కుశాల్ తంబె ఒక వికెట్ తీశాడు.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!